జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుకొండ మండలంలోఇటీవల అనారోగ్యంతో మరణించిన గీసుకొండ గ్రామానికి చెందిన మేకల మోహన్ . ఆదివారం మరణించిన మొగలిచర్ల కు చెందిన ఇప్ప శంకర్ అనే నిరుపేద వ్యక్తుల కుటుంబాలకు, గీసుకొండ గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకులు, రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ అయిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ మానవత్వంతో స్పందించి చెరొక ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం పంపగా, గీసుకొండ సోషల్ సర్వీస్ టీం ఆధ్వర్యంలో అట్టి నగదును బాధిత కుటుంబాలకు అందజేయడం జరిగింది.ఇప్ప శంకర్ కుటుంబ ఆర్థిక పరిస్థితిని గమనించిన గీసుకొండ సోషల్ సర్వీస్ టీం, మరొక 5 వేల రూపాయలు మొత్తంగా రూ10,000/- అందజేశారు.ఈకార్యక్రమంలో గీసుకొండ సోషల్ సర్వీస్ టీం ప్రతినిధులు కర్ణకంటి రాంమూర్తి, ముల్క సత్యనారాయణ, పసుల సంపత్, కత్తి వెంకటేశ్వర్లు, పోలీసు బాబురావు, గీసుకొండ గ్రామ మాజీ సర్పంచ్ దౌడు బాబు,మేకల బాబు, యాకూబ్ మరియు మొగిలిచర్ల సొసైటీ మాజీ చైర్మన్ దొంగల రమేష్, తెలంగాణ జెఏసి నాయకులు ఆడెపు రమేష్,లెంకలపల్లి శ్రీనివాస్, బిల్లా రవి, గాదం వేణు, బండి కుమారస్వామి, లెంకలపల్లి స్వామి, ఇప్ప శ్రీను, గోపాల్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన పెగళ్ళపాటి లక్ష్మినారాయణ సేవలను పలువురు కొనియాడారు.

