Preloader
వినియోగదారులకు సరుకులను నిర్ణీత తూకం కంటే తక్కువగా విక్రయిస్తూ మోసాలకు పాల్పడితే వ్యాపారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి కూచన మనోహర్ హెచ్చరించారు.శనివారం వరంగల్ పట్టణంలోని పలు బియ్యం దుకాణాలు, కిరాణా, జనరల్ స్టోర్లలో తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బియ్యం బస్తాలను తూకం వేయగా, 26 కిలోలుగా పేర్కొన్న బస్తాల్లో కేవలం 25 కిలోల బియ్యం మాత్రమే ఉన్నట్లు గుర్తించి మరియు ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలను ఉల్లంగించిన వారిపై ప‌ది కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా కూచన మనోహర్ మాట్లాడుతూ, ప్రతి వ్యాపారి ప్యాకింగ్ చేసిన సరుకులపై నికర బరువును స్పష్టంగా ముద్రించాలని, ప్రకటించిన బరువుకు అనుగుణంగానే వినియోగదారులకు సరుకులు విక్రయించాలని సూచించారు. బస్తాలపై పేర్కొన్న బరువు కంటే తక్కువగా సరుకులు విక్రయిస్తే తూనికలు, కొలతల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.వినియోగదారులు సైతం సరుకులు కొనుగోలు చేసే సమయంలో ప్యాకెట్లపై ముద్రించిన నికర బరువును, తూకాన్ని పరిశీలించాలని సూచించారు. వ్యాపారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, వినియోగదారుల హక్కులను కాపాడేందుకు తనిఖీలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

Share this news as a Photo Card

31 October 2026

బియ్యం, కిరాణా దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు వ్యాపారులపై 10 కేసులు నమోదు

www.jaibharatvoice.com