-గాయాల పాలవుతున్న జనం
(జై భారత్ వాయిస్, న్యూస్ ఆత్మకూరు )
ఆత్మకూరు మేజర్ గ్రామ పంచాయతీలో ప్రజలు కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెల్లారిందంటే చాలు ఇంటి పై కప్పుల మీద గుంపులుగా దర్శనమిస్తున్న కోతులు పనులు చేసుకోనివ్వడం లేదని మహిళలు వాపోతున్నారు. పదుల సంఖ్యలో ఎగబడుతున్న కోతులు పచ్చని చెట్లపైనే రోజంతా గడుపుతూ ఇంటివారిని అవస్థల పాలు చేస్తున్నాయి.
ఏమరపాటుగా ఉంటే ఇళ్లల్లోకి జొరబడి వస్తువులను పాడు చేస్తున్నాయని, కోతుల స్వైర విహారం వల్ల పచ్చని పండ్ల చెట్లను సైతం తొలగించుకోవాల్సి వస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా తేలికగా కొట్టి పారేస్తున్నారని ఆరోపించారు. గుంపులు వచ్చి దాడి చేయడం వల్ల పలువురు గాయాల పాలయ్యారని తెలిపారు. సమస్య చిన్నదే అయినా గ్రామస్థులను కంటిపై కునుకు లేకుండా చేస్తోందని, కోతుల బాధ తీర్చేవారే కరువయ్యారని ప్రధాన కూడళ్ల వద్ద చర్చించుకుంటున్నారు.
