Preloader

జై భార‌త్ వాయిస్ న్యూస్ వ‌రంగ‌ల్
వ‌రంగ‌ల్ నగర పరిధిలో ఎక్కడా అనుమతులు లేని బిల్‌బోర్డులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన అనధికారిక ప్రకటనల బోర్డులు, ఫ్లెక్సీలు, బ్యానర్లను తక్షణమే తొలగించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించాలని అధికారులకు స్పష్టం చేశారు. నగరాభివృద్ధి పనుల అమలుతో పాటు ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందించడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం అధికారుల ప్రధాన బాధ్యత అని కమిషనర్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపడుతూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Share this news as a Photo Card

03 November 2026

అనధికారిక ఫ్లెక్సీలు, బ్యానర్లు, బిల్‌బోర్డులను తక్షణమే తొలగించాలి

www.jaibharatvoice.com