Preloader

జై భార‌త్ వాయిస్ న్యూస్ భాగ్య‌న‌గ‌రం
తెలంగాణ పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఫిట్‌కాప్ (FitCop) కార్యక్రమాన్ని, రాష్ట్ర పోలీస్‌లోని అన్ని విభాగాలు, యూనిట్లకు విస్తరించేందుకు తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్, ఐపీఎస్, చర్యలు చేపట్టారు.ఈ నేపథ్యంలో యాప్ డెవలపర్లు, tech team, ఉన్నతాధికారులతో డీజీపీ సమావేశమై యాప్‌లో పొందుపరచాల్సిన ఆరోగ్య ప్రమాణాలు, అవసరమైన ఫీచర్లపై సమీక్షించారు. ఈ కార్యక్రమానికి రానున్న పదేళ్ల పాటు పూర్తి ఆర్థిక సహకారం అందించేందుకు స్పాన్సర్ ముందుకు వచ్చారు.అనంతరం అవగాహన ఒప్పందం (MoU), యాప్ ప్రారంభం తర్వాత అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. రానున్న 40–45 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.తెలంగాణ పోలీస్‌లోని మొత్తం 90,000 మంది సిబ్బందికి BMI, ఎత్తు, బరువు, రక్తపోటు, మధుమేహ పరీక్షలు నిర్వహించి వివరాలను నమోదు చేయనున్నారు. అధిక ఆరోగ్య ముప్పు ఉన్న సిబ్బందిని గుర్తించి, కాల్ సెంటర్ ద్వారా వైద్యులు ఫోన్ చేసి అవసరమైన వైద్య సూచనలు అందిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తారు.ఈ కార్యక్రమంలో మానసిక ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత ఆహార ప్రణాళికలు, వ్యాయామ సూచనలు, సమగ్ర ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు.కేవలం ఆరోగ్యాన్ని పర్యవేక్షించడమే కాకుండా, ప్రతి పోలీస్ సిబ్బంది ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని మరింత మెరుగ్గా విధులు నిర్వహించేలా చేయడమే ఫిట్‌కాప్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని డీజీపీ పేర్కొన్నారు.

Share this news as a Photo Card

06 November 2026

తెలంగాణ పోలీస్ సిబ్బంది ఆరోగ్యం కొసం త్వ‌ర‌లో ఫిట్‌కాప్

www.jaibharatvoice.com