Preloader

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ. అక్టోబర్ 22 నుండి నవంబర్ 30, 2026 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఖేత్ బచావో అభియాన్” రైతు సమగ్ర శిక్షణ ఉద్యమం కార్యక్రమం రైతునేస్తం లోభాగంగా గీసుకొండ మండలంలోని కొనాయమాకుల రైతువేదికలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి ఎం. విజయభాస్కర్ మాట్లాడుతూ PACS లు, FPO లు, SHG లు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎస్.ఎం.ఎ.ఎం. పథకం కింద కస్టమ్ హైరింగ్ సెంటర్లను నెలకొల్పడానికి ముందుకు రావాలన్నారు. ఖేత్ బచావో అభియాన్ ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, నీరు-ఎరువుల ఖర్చులను తగ్గించి, రైతులకు స్థిరమైన నికర ఆదాయాన్ని సాధించిపెట్టడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని, ఇందులో భాగంగా రైతులు సమతుల్య ఎరువుల వాడకం, రసాయనాల భారాన్ని తగ్గించే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించడం, పంట అవశేషాలను కాల్చివేయకుండా నేలలో కలియదున్నడం లేదా మల్చింగ్ చేయడం వంటివి చేయాలని సూచించారు. అలాగే రసాయన, సేంద్రియ ఎరువులను సమన్వయం చేసే సమగ్ర పోషక నిర్వహణ (INM), సమగ్ర సస్యరక్షణ చర్యలు (IPM) చేపట్టడం, సూక్ష్మ సేద్యం ద్వారా నీటిని సంరక్షించడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు నిర్ణయాలు తీసుకోవడం వరి పంటను ఈ యాసంగి లో పూర్తిగా మానేసి నూనెగింజలు, పప్పుధాన్యాల సాగుచేసి పంటల వైవిధ్యీకరణను పాటించాలన్నారు. ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ విజయనిర్మల మాట్లాడుతూ గ్రామాల్లో రైతులకు రైతు ఉత్పత్తి సంఘాలకు అవసరాన్ని బట్టి వివిధ పంటలపై సాగు విధానాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు కార్పొరేట్ వ్యవసాయ తరహాలో భూములను లీజుకు తీసుకొని వివిధ రకాల పంటలను తమ సొంత బ్రాండ్ పై ఉత్పత్తి చేసి ప్రభుత్వ మద్దతుతో మార్కెటింగ్ సౌకర్యం పొంది వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చుకోవాలని సూచించారు. ఈ యాసంగిలో తక్కువనీటితో ఎక్కువ ఆదాయం ఇచ్చే కూరగాయలు, పుచ్చకాయ లాంటి ఉద్యాన పంటలను సాగు చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి . రమేష్ , జిల్లా పశు వైద్యాధికారి టి.బాలోజి , వర్ధన్నపేట ఏ.డి.ఏ., జి.నర్సింగం, వ్యవసాయ అధికారులు సిహెచ్ కృష్ణారెడ్డి, ఎన్.రవీందర్, పి హరి ప్రసాద్ బాబు, పశు వైద్యాధికారి శ్రీకాంత్ రెడ్డి,ఏఈఓలు భరత్, స్మిత, DRDA APD, ఏపీఎం ఈశ్వర్, కొనయమాకుల సర్పంచ్ వజ్ర రాజు, కార్యదర్శి రామారావు, మండలంలోని అన్ని సొసైటీల సీఈవోలు, ఎఫ్ పి ఓ ఎస్ హెచ్ జి సంఘాల ప్రతినిధులు మరియు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share this news as a Photo Card

27 October 2026

రైతు ఉత్పత్తి సంఘాలకు సబ్సిడీ యంత్రాలు-ఖేత్ బచావో అభియాన్ లో డి.ఏ.ఓ. విజయభాస్కర్

www.jaibharatvoice.com