Preloader
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి ఉత్సవాలను బి.సి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్‌లోని గోపాలస్వామి గుడి సమీపంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి,జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,కూడా  చైర్మన్ గుండు సుధారాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, లు పాల్గొని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  బాపూజీ తెలంగాణ ఉద్యమం, సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి పుష్పలత, వరంగల్ ఆర్డీఓ సుమ, వరంగల్ తహశీల్దార్ శ్రీకాంత్, ప్రజాప్రతినిధులు, అధికారులు, బీసీ సంఘాల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

27 September 2026

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి ఉత్సవాలు

www.jaibharatvoice.com