వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ‘యువ టూరిజం క్లబ్’ ఆధ్వర్యంలో ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం’ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగింది. విద్యార్థులలో సామాజిక బాధ్యత, సంస్కృతి మరియు చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణపై అవగాహన పెంచే లక్ష్యంతో కాకతీయుల వైభవంపై వ్యాసరచన, వక్తృత్వం, పోస్టర్ డిజైనింగ్, లోగో డిజైనింగ్ మరియు హెరిటేజ్ సైట్ పెయింటింగ్ పోటీలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ పి. శ్రీనివాస్, జిల్లా యువ టూరిజం క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఒ. రాజేందర్ విజేతలకు ప్రశంసా పత్రాలు, బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఎంతైనా ఉందని పేర్కొన్నారు.పోటీల విజేతల వివరాలు:
వ్యాసరచన (Essay Writing): ప్రథమ – ఆమినా కౌసర్, ద్వితీయ – బి. ప్రీతమ్, తృతీయ – ఎస్.కె. సోహైల్, వక్తృత్వం (Elocution): ప్రథమ – ఎస్.కె. సోహైల్, ద్వితీయ – ఎస్. పవిత్ర, తృతీయ ఆసియా కౌసర్, పోస్టర్ డిజైన్ (Poster Design): ప్రథమ -వి. షణ్ముఖ సాయి, ద్వితీయ – హితేష్, తృతీయ – ఎస్.కె. నజ్మా, లోగో డిజైన్ (Logo Design): ప్రథమ – వి. షణ్ముఖ సాయి, ద్వితీయ – ఎస్.కె. నజ్మా, తృతీయ – బి. వర్షితశ్రీ
హెరిటేజ్ సైట్ పెయింటింగ్ (Heritage Site Painting): ప్రథమ – డి. అక్షయ, ద్వితీయ – ఆమినా కౌసర్, తృతీయ – ఎ. హితేష్ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల విభాగాధిపతులు (HODs), కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
