Preloader
వరంగల్ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు SA–I పరీక్షలను 01-10-2026 నుండి 09-10-2026 వరకు టైమ్‌టేబుల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు 

 

జవాబు పత్రాల మూల్యాంకనం:*

24-10-2026 నాటికి* జవాబు పత్రాల దిద్దుబాటు పూర్తి చేసి, ఫలితాలను ప్రకటించాలి.

మార్కుల నమోదు & ఆన్‌లైన్ అప్‌లోడ్:

28-10-2026 నాటికి* మార్కులను రిజిస్టర్లలో నమోదు చేసి, ప్రతి విద్యార్థి మార్కులు/ఫలితాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.

30-10-2026న* తల్లిదండ్రుల సమావేశం (PTM) నిర్వహించి, ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిని తల్లిదండ్రులతో చర్చించాలి.

 

ప్రశ్నాపత్రాల సేకరణ:

సంబంధిత *MRC (మండల వనరుల కేంద్రం)* నుండి ప్రశ్నాపత్రాలను రోజు వారీగా హెడ్‌మాస్టర్లు/ప్రిన్సిపాళ్లు సేకరించాలి.

ప్రశ్నాపత్రాల భద్రత:

సంబంధిత మండలాల *MEOలు మరియు MIS కోఆర్డినేటర్లు* ప్రశ్నాపత్రాలకు కస్టోడియన్/జాయింట్ కస్టోడియన్‌గా వ్యవహరిస్తారు.

 అన్ని యాజమాన్యాల హెడ్‌మాస్టర్లు/ప్రిన్సిపాళ్లు పై సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ SA–I పరీక్షలను నిర్ణీత టైమ్‌టేబుల్ ప్రకారం సజావుగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి సూచించారు

Share this news as a Photo Card

27 September 2026

పాఠశాల విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్–I (SA–I) పరీక్షలు

www.jaibharatvoice.com