జై భారత్ వాయిస్ న్యూస్ కానూరు:
మన సాంప్రదాయాన్ని కాపాడుకోవడం మన బాధ్యత, పండుగలను ఘనంగా నిర్వహించడమే కాదు, వాటి వెనకున్న విలువలను కూడా మన తర్వాతి తరాలకు అందించాలని: మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ సూచించారు కానూరు 100 అడుగుల రోడ్డులో వర్ణం సంస్థ అధిపతులు తోటపల్లి గౌతం, శుభశ్రీ దంపతుల ఆధ్వర్యంలో, అనుమోలు గ్రౌండ్స్ లో నిర్వహించనున్న దేవీ నవరాత్రి దసరా ఉత్సవాలకు శ్రీ రుద్రయాగ పురస్వర శత చండీ యాగాలకు భూమి పూజ మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ నిర్వహించారు ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతిలో దేవీ నవరాత్రులకు ఎంతో విశిష్టమైన స్థానం ఉందని, తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాలలో ఆరాధించడం వేనక గొప్ప ఆధ్యాత్మిక సందేశం ఉందని, చెడుపై మంచి సాధించిన విజయానికి, అధర్మంపై ధర్మం సాధించిన విజయాలకి ఈ వేడుకలు ప్రతిరూపాలుగా ఉంటాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఆకునూరు మాజీ సర్పంచ్ గోలి వసంత కుమార్, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ప్రేరేపి ఈశ్వర్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
