Preloader

జై భారత్ వాయిస్ న్యూస్ ఉయ్యూరు. ఉయ్యూరు పట్టణంలోని సుందరమ్మ పేట లో జరుగుతున్న వినాయక ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని వినాయకునికి పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి, వినాయక శోభాయాత్రను
ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “మన జీవితంలో తొలి దేవుళ్లు తల్లిదండ్రులే. మన కోసం ఎన్నో త్యాగాలు చేసిన తల్లిదండ్రులను గౌరవించడం, వారి మాటకు విలువ ఇవ్వడం, వారిని సంతోషంగా చూసుకోవడమే గణపతికి చేసే నిజమైన పూజ” అని రాజేంద్రప్రసాద్ అన్నారు.యువత ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తల్లిదండ్రులను ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు. కుటుంబంలో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత ఉండాలని, ఆ కుటుంబ ఐక్యతే సమాజ ఐక్యతకు పునాది అవుతుందని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.అదేవిధంగా యువత పర్యావరణ పరిరక్షణలో ముందుండాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, చెరువులు, కాలువలు, నదులను కలుషితం చేయకుండా బాధ్యతగా పండుగను జరుపుకోవాలని రాజేంద్రప్రసాద్ సూచించారు.“మన ఆనందం కోసం జరుపుకునే పండుగ వల్ల ప్రకృతికి నష్టం కలగకూడదు. పర్యావరణాన్ని కాపాడటం అంటే మన భవిష్యత్ తరాలను కాపాడటమే” అని రాజేంద్రప్రసాద్ అన్నారు.వినాయక శోభాయాత్రలో యువత క్రమశిక్షణతో వ్యవహరిస్తూ, సమాజానికి ఆదర్శంగా నిలవాలని రాజేంద్రప్రసాద్ కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బూరెల నరేష్, మేడిశెట్టి మస్తాన్, చినపతి పండు, లంక అప్పల నాయుడు, గణేష్ కమిటీ ప్రతినిధులు సురేష్, అనిల్,శివ, ఫణి,ఆరేపల్లి సాయి తదితరులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share this news as a Photo Card

03 October 2026

తల్లిదండ్రులే తొలి దేవుళ్లు.. వారిని గౌరవించడమే గణపతికి నిజమైన పూజాa

www.jaibharatvoice.com