Preloader

జై భార‌త్ వాయిస్ న్యూస్ విజ‌య‌వాడ‌
​విజయవాడ నగరంలో అక్టొబ‌ర్ 11. నుండి 20 వరకు వైభవంగా జరుగుతున్న విజ‌య‌వాడ న‌గ‌రంలోని ఇంద్ర‌ఖిలాద్రి క‌నుక‌దుర్గ అమ్మావారి న‌వ‌రాత్రులు , దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్ 2.0, పున్నమి ఘాట్‌లో జరుగుతున్న జాతీయ సరస్ మేళా సందర్భంగా విచ్చేసే భక్తుల భద్రత కొరకు ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ బందోబస్తు ఏర్పాట్లను భక్తుల సౌకర్యార్థం మోడల్ గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సోమావారం నాడు రాష్ట్ర హోమ్ శాఖామాత్యులు అనిత సందర్శించి, పరిశీలించారు. ఈ నేపథ్యంలో డి.సి.పి.లు షిరిన్ బేగం కె.జి.వి.సరిత,కృష్ణ ప్రసన్న తో పాటు ఇతర పోలీస్ అధికారులు హోమ్ మంత్రికి కమాండ్ కంట్రోల్ పనితీరును క్షుణ్ణంగా వివరించారు. ​కమాండ్ కంట్రోల్ నందు ఏర్పాటు చేసీన 30 అధునాతన డ్యాష్‌బోర్డుల ద్వారా ​ఏఐ (AI), డ్రోన్లు ఏఎన్‌పిఆర్ (ANPR): క్యూలైన్లలో భక్తుల కదలికలు, పార్కింగ్ స్థలాలు, ఆర్టీసీ రైల్వే ప్రయాణికుల రద్దీని ఏఐ కెమెరాలు, డ్రోన్లు, ANPR సిస్టమ్ డిజిటల్ ట్విన్స్ పరిజ్ఞానంతో క్షేత్రస్థాయి పరిస్థితులను నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సారి ప్రత్యేకంగా భక్తుల సంఖ్యను రద్దీని ఎప్పటికప్పుడు గణిస్తూ నిరంతర పర్యవేక్షణకు 70కి పైగా అనలైటికల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం నగరంలో 40 పార్కింగ్ పాయింట్ల ఏర్పాటు మరియు ఎల్.ఈ.డి. స్క్రీన్లతో కూడిన 3 హోల్డింగ్ ఏరియాలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ​అత్యంత పకడ్బందీగా, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖ చేపట్టిన ఈ వినూత్న ప్రణాళికలు మరియు బందోబస్తు ఏర్పాట్ల పట్ల హోమ్ మంత్రి అనిత సంతోషం వ్యక్తం చేశారు.

Share this news as a Photo Card

12 October 2026

దసరా శరన్నవరాత్రుల బందోబస్తు ఏర్పాట్లను, పరిశీలించినహోమ్ మంత్రి వంగలపూడి అనిత

www.jaibharatvoice.com