జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
వరంగల్ జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ ఆధ్వర్యంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏ లను ప్రకటించి మిగతా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చినందున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలిసి తన వంతు కృషి చేస్తానని తెలిపారు అదేవిధంగా ఉద్యోగులు కూడా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు చేరే విధంగా పనిచేయాలని కోరారు. వరంగల్ జిల్లా టీఎన్జీఓస్ యూనియన్ అధ్యక్షులు గాజే వేణుగోపాల్ మాట్లాడుతూ, ఉద్యోగులందరూ అన్ని రంగాలలో రాష్ట్రంలోనే వరంగల్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలప డానికి కష్టపడి పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పాలకుర్తి సదానందం గౌరవ అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్ నర్సంపేట యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణమోహన్ మహేందర్ జిల్లా బాధ్యులు చిరంజీవి తదితర సంఘ నాయకులు పాల్గొన్నారు
