Preloader

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ వరంగల్ నగరంలోని ఉరుసుగుట్ట చెరువు నిమజ్జన ప్రాంతాన్ని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న సందర్శించి, వర్షం కురుస్తున్న నేపథ్యంలో నిమజ్జన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తుల సౌకర్యం, భద్రతకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలిస్తూ, వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. భక్తిశ్రద్ధలతో నిమజ్జనానికి తరలివచ్చే ప్రజలకు సురక్షితమైన వాతావరణం కల్పిస్తూ, నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు

Share this news as a Photo Card

23 September 2026

వర్షంలోనూ భక్తులకు ఇబ్బందులు లేకుండా నిమజ్జన ప్రక్రియ సజావుగా నిర్వహణ

www.jaibharatvoice.com