Preloader

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వరంగల్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించినందున విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు రేపు గురువారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్  సత్య శారద తెలిపారు.ప్రభుత్వ,ప్రైవేటు , పాఠశాల తో పాటు కాలేజీలకు, అంగన్వాడి లకు కూడా సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, వర్షాలు, వరదలు, లోతట్టు ప్రాంతాల    నివాసులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు.జిల్లాలో వర్ష పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్  ఏర్పాటు చేయడమైనదని,
టోల్ ఫ్రీ నెంబర్ 18004253424,9154252936
24 గంటలు  పనిచేస్తుందని,  అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు అయితే వెంటనే పైన పేర్కొనబడిన టోల్ ఫీ నెంబర్ కి కాల్ చేయగలరని   జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
24 గురువారం సెలవు రోజుగా ప్రకటించినందున నవంబర్ 14 న విద్యా సంస్థలకు పని దినంగా ప్రకటించడమైనది.

Share this news as a Photo Card

23 September 2026

24న విద్యా సంస్థలకు  సెలవు: వరంగల్ జిల్లా కలెక్టర్  సత్య శారద

www.jaibharatvoice.com