(జై భారత్ వాయిస్ న్యూస్ ఉయ్యూరు)
ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం 20వ వార్డులో మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని కూటమి అభ్యర్థులను బలపరచాలని కోరారు ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..“వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడింది.. ప్రజా సమస్యలు పట్టించుకోని పాలనకు ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పారు. మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా ఉయ్యూరు అభివృద్ధికి కూటమికి బలమైన మద్దతు ఇవ్వాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు చేరువగా పాలన అందిస్తోంది. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మున్సిపాలిటీలో కూడా కూటమి బలపడాలి. 20వ వార్డులో కూటమి అభ్యర్థి గోవిందరాజుల భవానిని గెలిపించడంతో పాటు, చైర్మన్ అభ్యర్థి చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్కు అండగా నిలవాలి. వైసీపీని తిరస్కరించి, TDP అభ్యర్థులకు ఘన విజయం అందించి,ఉయ్యూరు అభివృద్ధికి ప్రజలు తమ తీర్పు ఇవ్వాలి” అని వై.వీ.బీ.రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు.ఈ ప్రచార పర్వంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ ,తెలుగుదేశం నాయకులు రత్నం శివ ప్రసాద్ బుజ్జి ,వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ , సయ్యద్మతుల్లా ,రాజులపాటి ఫణి గారు, జంపన శ్రీనివాస్ , గోవిందరాజులు, పువ్వాడ రాంబాబు,ఆంజనేయులు, బాపిరాజు, మూర్తి , గబ్బిటా రమణ, లక్ష్మీ ,రషీద్ , గఫూర్ , చిన్మయి ,. శ్యామల , గోవిందరాజుల భవాని , మాజేటి శ్రీనివాసరావు, బ్రహ్మణ సంఘం నాయకులుకూటమి నాయకులు,కార్యకర్తలు,పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
