పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసివేసిన దుర్బుద్ధి వైసీపీది. అదే పేదవాడి ఆకలి తీర్చాలనే మంచి మనసుతో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించిన ఘనత తెలుగుదేశం పార్టీదని. మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు.శుక్రవారం ఉయ్యూరు మున్సిపాలిటీలోని 20, 21వ వార్డులలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్సీ వై. వి. బి. రాజేంద్రప్రసాద్ టిడిపి అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి వారి మద్దతును కోరడమైనది.ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.పేదవాడు కూలీకి వెళ్లి సంపాదించిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోవాలా.. లేక భోజనం కోసం మొత్తం కూలీ డబ్బు ఖర్చు చేయాలా? అనే పరిస్థితిలో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ ఒక పేద కుటుంబానికి భరోసాగా నిలిచిందని, అలాంటి భరోసానే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించిందని రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు పేదల కడుపు నింపే పథకాన్ని కూడా ఓర్వలేని వైసీపీ నాయకులు ఇప్పుడు మళ్లీ ప్రజల ముందుకు వచ్చి ఏం చెబుతారు? ఐదేళ్లు అధికారంలో ఉండి పేదలకు ఏం చేశారో చెప్పే ధైర్యం లేక, అబద్ధపు ప్రచారాలతోఇప్పుడు మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారు. ప్రజలు అన్నీ మర్చిపోయారని అనుకుంటే అది వారి భ్రమ.అని రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉయ్యూరు అభివృద్ధి కోసం టీడీపీ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్తో పాటు 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రూపా దేవిని, 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి లక్ష్మీ ని తమ అమూల్యమైన రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించండి” అని రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఉయ్యూరు మున్సిపల్ మాజీ చైర్మన్ వల్లభనేని నాని సత్యనారాయణ , టిడిపి నాయకులు వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ , రత్నం శివప్రసాద్ ,సయ్యద్ అజ్మతుల్లా, పలియాల శ్రీనివాసరావు , మురాల అయ్యగారు, వెంట ప్రగడ ఆంజనేయులు మాజేటి శ్రీనివాసరావు ,గుర్రాల సాయిబాబు,పుల్లేశ్వరావు ,వేణు,రషీద్ ,గఫర్, చైర్మన్ అభ్యర్థి సతీమణి శ్యామల ,టిడిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు