Preloader

జై భార‌త్ వాయిస్ న్యూస్ గీసుగొండ

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 24వ విడత నిధులను శుక్రవారం గుజరాత్‌లోని బనస్కంఠ జిల్లా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు . రైతులు ఈ ప్రత్యక్ష ప్రసారకార్యక్రమాన్ని మండలంలోని కొనాయమాకుల, శాయంపేట హవేలి రైతు వేదికల్లో వీక్షించారు. ఈ సంద‌ర్భంగా వ‌రంగ‌ల్ జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ మాట్లాడుతూ రైతులు ఈ నిధులు సద్వినియోగంచేసుకోవాలని నిధుల బదిలీలో ఇబ్బందులుంటే స్థానిక విస్తరణ అధికార్లు పరిష్కరిస్తారన్నారని సూచించారు.కార్యక్రమఅనంతరం ఖేత్ బచావో అభియాన్ లో వ్యవసాయ అభికారులు యాసంగి సాగుపై రైతులకు కీలక సూచనలు చేశారు. వ్య‌వ‌సాయ అధికారులు మాట్లాడుతూ ఎల్నినో నేపథ్యంలో మండలంలో ప్రధాన యాసంగి పంటైనా మొక్కజొన్న సాగుకు కూడ నీటి విద్యుత్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున పూర్తిగా తగ్గించాలని అన్నారు.రైతులు తక్కువ కాలపరిమితి పండే కూరగాయలు, తక్కువ నీటి అవసరం వుండే పప్పుదినుసు, నూనెగింజల పంటలు సాగుచేసుకోవాలన్నారు. పంట వ్యర్థాలను తాగులబెట్టొద్దని, జలవనరులను జాగ్రత్తగా వాడుకోవాలని అధికార్లు సూచించారు.కార్యక్రమం వరంగల్ ఏవో ఎన్. రవీందర్, డి.సి.ఓ. ఆఫీస్ సీనియర్ ఇన్‌స్పెక్టర్స్ మంద శ్రీనివాస్, కనక దుర్గ, తంమిశెట్టి శ్రీనివాస్, మండ‌ల వ్య‌వ‌సాయ అధికారి ప్ర‌సాద్ బాబు ఎఇఓ లు భరత్, రాజేష్, మండలంలోని సొసైటీల సీఈఓలు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

30 October 2026

పీఎం కిసాన్ నిధులు సద్వినియోగం చేసుకోవాలి

www.jaibharatvoice.com