జై భారత్ వాయిస్ న్యూస్ పోరంకి:జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధికి కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ అన్నారు పెనమలూరు నియోజకవర్గo పోరంకిలో జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ సొసైటీ నూతన కార్యాలయను మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నా జర్నలిస్టులకు తగిన సౌకర్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానని, జర్నలిస్టుల రక్షణకు,హక్కులకు అండగా నిలబడతానని రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు..ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధ్యక్షులు కొడాలి రాజేష్, తుంగల ప్రదీప్ కుమార్, ప్రసాద్, భాష,విజయ్ కుమార్, కిషోర్ నియోజకవర్గంలోని పాత్రికేయ సోదరులు పాల్గొన్నారు.
