Preloader

బాలల భద్రతే లక్ష్యం  ‘సురక్షిత్ బచుపన్ అభియాన్’


(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ) వరంగల్ జిల్లా సంగెం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) ఆధ్వర్యంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యనభ్యసిస్తున్న విద్యార్థినుల కోసం ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్ – బేటీ బచావో, బేటీ పడావో’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  warangal 2nd addition junior civil judge న్యాయమూర్తి  చంద్రప్రసన్న  Warangal) 3rd additional junior civil judge ఈ.హారిక మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ , DLSA ప్రతినిధి  పి. శ్రీనివాస్రావు , సంగెం ఎస్‌ఐ  వంశీకృష్ణ  విద్యార్థినులకు బాలల హక్కులు, చట్టపరమైన రక్షణ, బాలికల భద్రత, మహిళా సాధికారత, రాజ్యాంగ విలువలపై అవగాహన కల్పించారు.న్యాయమూర్తి చంద్రప్రసన్న  బాలికలకు సంబంధించిన చట్టపరమైన అంశాలు, వారి హక్కులు, సమాజంలో బాలికల భద్రత, ఆపద సమయంలో న్యాయ సహాయం పొందే విధానాల గురించి వివరించారు. అనంతరం  న్యాయమూర్తి  హారిక  భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, విధులు, సమానత్వం, న్యాయం వంటి రాజ్యాంగ విలువలను మరియు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ . శ్రీనివాస్ రావుగారు వివిధ చట్టాలు, బాలల హక్కులు, చట్టపరమైన రక్షణలు, బాలల సంరక్షణకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను వివరించారు.  సంగెం ఎస్‌ఐ  వంశీకృష్ణ  పోక్సో (POCSO) చట్టంలోని ముఖ్యమైన అంశాలు, బాలలపై జరిగే లైంగిక నేరాల నుంచి రక్షణ, అనుమానాస్పద లేదా ప్రమాదకర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలీసుల సహాయం పొందే విధానాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. KGBV సంగెం స్పెషల్ ఆఫీసర్ కె. నీలిమ  మాట్లాడుతూ, ప్రతి విద్యార్థిని తన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా సంబంధిత అధికారులకు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. బాలికల భద్రత, విద్య, ఆత్మవిశ్వాసం, సమగ్ర అభివృద్ధికి పాఠశాల ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమము లో ఉపాధ్యాయినిల బృందం పాల్గొన్నారు.

Share this news as a Photo Card

29 October 2026

www.jaibharatvoice.com