Preloader

పెన్షన్ కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు చంద్రబాబు అందిస్తున్న ఒక సామాజిక భరోసా::మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ అన్నారు. పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఉయ్యూరులోని ఏడు, 15వ వార్డుల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముందుకు సాగుతుందని, పెన్షన్ తీసుకునే ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తమ వెంట ఉందని నమ్మకం కల్పించడమే ఎన్టీఆర్ భరోసా లక్ష్యం అని అన్నారు. ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్ అందించడం వల్ల కుటుంబానికి కొంత ఆర్థిక ఊరట కలుగుతుందని అన్నారు.కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తుందని, అదేవిధంగా పేదల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, సగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన శ్రీనివాస్,మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా, కౌన్సిలర్ వడుపు లక్ష్మి, టీడీపీ నాయకులు వడుపుకార్తీక్, తిరుపతిరావు, చింతయ్య, నీనావాత్ రవి, ఆసిఫ్,సయ్యద్ జబి, శ్రీకాంత్, బాబి తదితరులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

01 October 2026

పెన్షన్ ఆర్థిక సహాయం కాదు సామాజిక భరోసా

www.jaibharatvoice.com