ఎంజెపిటిబిసిడబ్లు రెసిడెన్షియల్ స్కూల్, ఎచ్ పి వి (హ్యుమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజారెడ్డి, డిప్యూటీ డి ఎమ్ ఎచ్ ఓ/పి ఓ (సి ఎచ్ ఐ) డా. ప్రకాష్ కలిసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ ఆర్ ఆర్ తోట పి ఎచ్ సి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 14–15 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు ఎచ్ పి వి వ్యాక్సినేషన్ ప్రాముఖ్యత, ప్రయోజనాలు, ఎచ్ పి వి ద్వారా వచ్చే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వ్యాధి నివారణలో వ్యాక్సిన్ పాత్రపై వైద్య సిబ్బంది అవగాహన కల్పించి, 51 మంది విద్యార్థులకు ఎచ్ పి వి వ్యాక్సిన్ వేశారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజా రెడ్డి మాట్లాడుతూ, కిశోర బాలికల ఆరోగ్య పరిరక్షణలో ఎచ్ పి వి వ్యాక్సినేషన్ ముఖ్యమైనదని, తల్లిదండ్రులు, విద్యార్థులు వ్యాక్సినేషన్‌పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అర్హులైన విద్యార్థులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో డా. అరుణ్ జోషి, పి ఓ (ఎన్ టి ఇ పి), డా. అనిత, వైద్య అధికారి యు పి ఎచ్ సి ఎస్ ఆర్ ఆర్ తోట, సంబంధిత రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ అంజి రెడ్డి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.