Preloader

జై భారత్ వాయిస్ న్యూస్ జగిత్యాల
యస్ ఐఆర్ ప్రక్రియలో.  ఇబ్బందుల   జరుగుతున్నాయని ఏకపక్ష విధానాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య  ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్  పాల్గొన్నారు యస్ ఐఆర్ ప్రక్రియలో ఓటర్లకు ఎదురవుతున్న ఇబ్బందులు, ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్ఓ ప్రసాద్, ఆర్డీఓ మధుసూదన్ కు వినతిపత్రం అందజేశారు.

ఓటు హక్కును కాపాడాలి: ఆడువాల జ్యోతి లక్ష్మణ్

ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో   ఓటు హక్కు అత్యంత విలువైనదని అన్నారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.SIR ప్రక్రియలో ఓటర్ల పేర్ల తొలగింపు, నోటీసులు, అభ్యంతరాలు, వాటి పరిష్కారానికి సంబంధించిన అంశాలపై పూర్తి పారదర్శకత అవసరమన్నారు. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థపై ప్రజలకు నమ్మకం ఉండాలంటే దాని నిర్ణయాలు, చర్యలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు.ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో కలగకుండా ఎన్నికల సంఘం వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.“ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, ఓటు హక్కు అత్యంత కీలకమైన అంశాలు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా అన్యాయంగా తొలగిపోకూడదని SIR ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను సమగ్రంగా పరిశీలించి ప్రజలకు స్పష్టత ఇవ్వాలి” అని జ్యోతి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగబద్ధ సంస్థల్లో పనిచేసే అధికారులు రాజకీయ పక్షపాతానికి దూరంగా ఉండి తమ బాధ్యతలను నిష్పాక్షికంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశ పారదర్శకంగా ఉంటేనే ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.SIR ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న అభ్యంతరాలను పరిశీలించి, ఓటర్ల హక్కులను పరిరక్షించాలని, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. SIR విషయంలో ఏకపక్ష విధానం అనుసరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మెన్ దినేష్, tpcc నాయకులు కృష్ణ రావు, బండ శంకర్,ఆత్మ చైర్మెన్ కాటిపెళ్ళి గంగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ లు, మండల పార్టీ అధ్యక్షులు సర్పంచులు కౌన్సిలర్ లు మార్కెట్ చైర్మెన్ లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని SIR ప్రక్రియపై తమ నిరసనను వ్యక్తం చేశారు.

Share this news as a Photo Card

28 September 2026

యస్ ఐఆర్  అక్రమాలకు తావులేకుండా పారదర్శకత పాటించాలి

www.jaibharatvoice.com