జై భారత్ వాయిస్ న్యూస్ జగిత్యాల:
జగిత్యాల పట్టణంలోని మోచి బజార్‌లో భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ , మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ చేసిన త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. స్వాతంత్ర్య సమరంలో చిన్న వయసులోనే భగత్ సింగ్ చూపిన నిబద్ధత, దేశభక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన భగత్ సింగ్ త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జ్యోతి లక్ష్మణ్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అరవింద్, భానుతేజ, సన్నీ, నాయకులు శేఖర్, పవన్, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

