జై భారత్ వాయిస్ న్యూస్జగిత్యాల :
జగిత్యాల పట్టణంలోని 40వ వార్డులో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో, రుద్ర భవాని సేవా సమితి నిర్వహణలో కుంకుమ పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, జగిత్యాల పట్టణం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, భగవత్ బాంధవులు, భగత్ సింగ్ యువసేన సభ్యులు, రుద్ర భవాని సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

