జై భారత్ వాయిస్ న్యూస్ జగిత్యాల: మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణిస్తూ, ఇతర మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.జగిత్యాల పట్టణంలో AVK మెహందీ ఆర్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెహందీ ఆర్ట్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు సౌమ్యను కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.హైదరాబాద్ నగరాన్ని తలపించే విధంగా జగిత్యాలలోనే మెహందీ ఆర్ట్‌ను అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. మహిళలు కోరుకునే విధంగా వివిధ రకాల డిజైన్లను అందిస్తూ, ప్రత్యేకమైన మెహందీ ఆర్ట్‌తో కస్టమర్లను ఆకట్టుకోవడం అభినందనీయమని తెలిపారు.మహిళలు తమలో ఉన్న నైపుణ్యాలను గుర్తించి స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని జ్యోతి లక్ష్మణ్ అన్నారు. ముఖ్యంగా ఒక మహిళ తనకు తాను ఉపాధి పొందడంతో పాటు, మరికొంతమంది మహిళలకు కూడా ఉపాధి కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు అండగా నిలవడం గొప్ప విషయమన్నారు. ఇలాంటి మహిళలను సమాజం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, మహిళా సాధికారతకు స్వయం ఉపాధి ఎంతో కీలకమని పేర్కొన్నారు. జగిత్యాలలో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ముందుకు సాగుతున్న సౌమ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మహిళలు తమ ప్రతిభను నమ్ముకుని ముందుకు సాగితే మరిన్ని విజయాలు సాధించవచ్చని జ్యోతి లక్ష్మణ్ అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మనపురి పవిత్ర మహేష్, కో ఆప్షన్ సభ్యులు వీరబత్తిని పద్మజ శ్రీనివాస్ మహిళలు పాల్గొన్నారు.
