జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ : MCPI(U) కేంద్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం వరంగల్ జిల్లా గీసుకొండ మండల కమిటీ ఆధ్వర్యంలో మచ్చాపూర్లో రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా MCPI(U) కేంద్ర కమిటీ సభ్యులు గోనె కుమారస్వామి, మండల కార్యదర్శి కనకం సంధ్య, సహాయ కార్యదర్శి గూడ సురేష్, జిల్లా నాయకులు బండి బుచ్చయ్య మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ సభ్యులు సోమిడి రవి, సోమిడి సాంబయ్య, మండల కమిటీ సభ్యులు జక్కుల రాజు, జిట్టి రాజు, మెట్టుపల్లి కుమారస్వామి, పులిచేరి సుధాకర్, కొసం రాజయ్య, చిర్ర సారయ్య, రంజిత్, ఖలీల్, కుమారస్వామి, ఫక్రుద్దీన్, పెండ్యాల లలిత, వాసం కవిత, శాంతమ్మ, సౌందర్య, వెంకటమ్మ, కవిత, సుధారాణి, వసంత, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
