Preloader

(జై భార‌త్ వాయిస్ న్యూస్ ఉయ్యూరు)
ఉయ్యూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 30,32 వార్డుల్లో పర్యటించి వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు రాజుల పాటి అంజనాదేవి, జంపాన పోరా కోడలు జంపాన విజయలక్ష్మి లను, చైర్మన్ అభ్యర్థి చేదుర్తి పాటి ప్రవీణ్ ను అత్యధిక మెజార్టీలతో గెలిపించాలని మాజీ ఎమ్మేల్సీ రాజేంద్రప్రసాద్ ఓట‌ర్ల‌ను కొరారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ , లోకేష్ బాబు మంచి సంకల్పంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పరిపాలన సాగిస్తున్నారని, వారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తూ ఉయ్యూరు మున్సిపాలిటీని అత్యధిక మెజార్టీతో గెలిపించి వారికి బహుమతిగా ఇవ్వాలని, కూటమి ప్రభుత్వం ద్వారానే ఉయ్యూరు పట్టణ అభివృద్ధి సాధ్యమని రాజేంద్రప్రసాద్ అన్నారు.ఈ కార్యక్రమాల్లో చైర్మన్ అభ్యర్థి చేదుర్తి పార్టీ ప్రవీణ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్లు వల్లభనేని సత్యనారాయణ, జంపాన పూర్ణచంద్రరావు, తెదేపా నాయకులు రత్నం బుజ్జి, వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్, జంపన వీర శ్రీనివాస్, సయ్యద్ అజ్మతుల్లా, రాజుల పార్టీ ఫణి, వార్డ్ అబ్జర్వేర్ రమేష్, చలపాటి శ్రీను,చిన్ని, చినబాబు, మురాల వెంకటేశ్వరరావు, ఆరేపల్లి సుబ్బారావు, నాగరాజు, తేజ, సంజయ్, అర్జున్ రావు, పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

30 October 2026

ఉయ్యూరు మున్సిపాలిటీ ఎన్నికలలో కూట‌మి అభ్య‌ర్థుల‌ను గెలిపించండి

www.jaibharatvoice.com