Preloader
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్):వరంగల్ జిల్లా పరిధిలోని 16 పీఎంశ్రీ పాఠశాలలకు సంబంధించి జిల్లా స్థాయి మాక్ పార్లమెంట్, ఆర్ట్ అండ్ కల్చర్ పోటీలను గ్రేటర్ వరంగల్ శంభునిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  బుధవారం నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లాలోని వివిధ పీఎం శ్రీ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

  1. వరంగల్ జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలలో వివిధ అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ, వారు రాష్ట్రస్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అధికారులు ఆకాంక్షించారు.
  2. ఈ ముగింపు కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ డాక్టర్ కట్ల శ్రీనివాస్, అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఎం. మహేష్ నాయక్, జిల్లా సైన్స్ అధికారి సురేష్ బాబు, జిల్లా ఉల్లాస్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, స్థానిక మండల విద్యాధికారి వెంకటయ్య, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అహ్మద్, జ్యూరీ సభ్యులు, సోషల్ ఫోరం అధ్యక్షులు రమేష్, ఫోరం సభ్యులు, ప్యానెల్ టీమ్ సభ్యులు, గైడ్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
  3. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థుల వివరాలు
  4. . మాక్ పార్లమెంట్ విభాగంలోప్రథమ బహుమతి: కె. హాసిని – ప్రభుత్వ పాఠశాల, నరేంద్రనగర్.
    ద్వితీయ బహుమతి: సుధాక్షి – టీఎస్ఆర్ఐఎస్, నెక్కొండ పాఠశాల.

    స్పెల్ బీ విభాగంలో

    ప్రథమ బహుమతి: ఈ. వెన్నెల – టీఎస్ఆర్ఐఎస్, నెక్కొండ.
    ద్వితీయ బహుమతి: బి. మనోజ్ – టీజీఎంఎస్, బుధరావుపేట.

    ఆర్ట్ అండ్ కల్చర్ విభాగంలో

    ఫోక్ డాన్స్ (జానపద నృత్యం):

    ప్రథమ బహుమతి: జెడ్పీహెచ్ఎస్, నరేంద్రనగర్.
    ద్వితీయ బహుమతి: టీజీఎంఎస్, వంచనగిరి.

    ప్రాథమిక పాఠశాలల విభాగం:

    ప్రథమ బహుమతి: ఎంపీపీఎస్, నరేంద్రనగర్.
    ద్వితీయ బహుమతి: ఎంపీపీఎస్, నారప్పపేట.
    మరో బహుమతి: ఎంపీపీఎస్, ఇల్లంద.

    ఆర్ట్ / డ్రాయింగ్ / పెయింటింగ్:

    ప్రథమ బహుమతి: సి.హెచ్. తేజస్వి – టీజీఎంఎస్, బుదరావు పేట.

  5. – ద్వితీయ బహుమతి: ఝాన్సీ – పర్వతగిరి.

    క్రాఫ్ట్ విభాగంలో

    ప్రథమ బహుమతి: ఎస్. మనస్విని – టీజీఏమైస్ , గవిచర్ల. ద్వితీయ బహుమతి: బి. తేజశ్రీ – TREIS నెక్కొండ.

    సంగీత విభాగం:

  6. – ప్రథమ బహుమతి: డి. ధనుష్ – రవిచర్ల.
    వయోలిన్ విభాగంలో ప్రథమ బహుమతి: ఏ. ప్రణవి – టీజీఎంఎస్, కవిచర్ల.
    వయోలిన్ విభాగంలో తృతీయ బహుమతి: ఎం. లోకేష్ – బుధరావుపేట.
    స్థానిక సంగీత విభాగంలో ప్రథమ బహుమతి: ఎస్. మోక్ష – టీజీఎంఎస్, నెక్కొండ.
    ద్వితీయ బహుమతి: శివశ్రీ – రాయపర్తి.
    జిల్లా స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేశారు.

Share this news as a Photo Card

28 October 2026

పీఎం శ్రీ పాఠశాలల జిల్లా స్థాయి మాక్ పార్లమెంట్, ఆర్ట్ అండ్ కల్చర్ పోటీలు విజయవంతం

www.jaibharatvoice.com