Preloader
జై భారత్ వాయిస్ న్యూస్ నల్లబెల్లి
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని పంతులుపల్లి ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో, స్థానిక పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి, ఉపాధ్యాయులు కూనమల్ల రాజన్ బాబు సమకూర్చిన కంప్యూటర్ మరియు ల్యాప్ టాప్ ను స్థానిక సర్పంచ్ ఎరుకల లలిత రఘున, ఎంఈఓ ఎం. అనూరాధ , పిఆర్టీయు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరెడ్డి మహేందర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. వీరితోపాటు ఈకార్యక్రమంలో పాఠశాల ఏఏపిసి చైర్మన్ కదురు లావణ్య, పిఆర్టీయు మండల అధ్యక్ష కార్యదర్శులు ఉడుత రాజేందర్, బానోతు కృష్ణ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, సిఆర్పీ వైనాల రవి,అంగన్వాడీ టీచర్  సుజాత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ కర్ణకంటి రాంమూర్తి మాట్లాడుతూ హన్మకొండకు చెందిన స్వర్గీయ హెడ్ కానిస్టేబుల్ అడ్డూరి రాజనరేందర్ జ్ఞాపకార్థం వారి కూతుళ్ళు కంప్యూటర్ ను పాఠశాలకు బహుకరించినట్లు అదేవిధంగా అమెరికాలో స్థిరపడిన గీసుకొండకు చెందిన డాక్టర్ పసునూటి స్వాతి- కళ్యాణ్ అనే సైంటిస్ట్ దంపతులు పాఠశాలకు ఫర్నిచర్ ను బహూకరించినట్లు  రాంమూర్తి తెలిపారు పాఠశాల ఉపాధ్యాయులు కూనమళ్ల రాజన్ బాబు కూడా తన సొంత ఖర్చులతో ల్యాప్ టాప్ ను సమకూర్చినట్లు తెలుపుతూ వారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ ఎం. అనురాధ మాట్లాడుతూ పంతులుపల్లి పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యబోధనలో చక్కని పనితీరును కనబరుస్తూ,దాతల సహకారంతో పాఠశాలకు కంప్యూటర్లు, ఫర్నిచర్ సమకూర్చడం అభినందనీయం అన్నారు.
స్థానిక సర్పంచ్ ఎరుకల లలిత మాట్లాడుతూ తమ ఊరి పాఠశాలలో ఇలాంటి ఉపాధ్యాయులు పనిచేయడం తమ గ్రామ అదృష్టం అని పేర్కొన్నారు.

 పిఆర్టీయు వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరెడ్డి మహేందర్ మాట్లాడుతూ పంతులుపల్లి పాఠశాలలో ఉపాధ్యాయులు ఎంతో ముందు చూపుతో విద్యార్థులకు పరిజ్ఞానం అందజేయడం కోసం కంప్యూటర్, ల్యాప్ టాప్ సమకూర్చడం తనకు ఎంతో సంతోషం కలిగించిందనీ, మున్ముందు ఈ పాఠశాలలో పిల్లల మౌళిక సదుపాయాల అభివృద్ధికి తన వంతుగా కూడా ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.

Share this news as a Photo Card

27 October 2026

పంతులుపల్లి పాఠశాలలో కంప్యూటర్లు ప్రారంభం

www.jaibharatvoice.com