జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వరంగల్ జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగా పోటీ చేస్తున్న ముల్క ప్రసాద్ గారు గురువారం వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయంలోని జడ్పీ హాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.ఈ సందర్భంగా ముల్క ప్రసాద్ గారు మాట్లాడుతూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు, రక్తదానం, ఆరోగ్య సేవలు, విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలు, సామాజిక సేవలను మరింత విస్తృతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.అలాగే, రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలను మరింత బలోపేతం చేసేందుకు తమ ప్యానల్ సభ్యులతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. రెడ్ క్రాస్ సభ్యులు తమ ప్యానల్ సభ్యులకు ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముల్క ప్రసాద్ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేశారు.
