ఆయుర్వేదంతో ఆరోగ్యం
జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్:
జాతీయ ఆయుర్వేద వైద్య దినోత్సవం సందర్భంగా బుధవారం ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలో ఉచిత మేగా ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిఖరానికి ముఖ్య అతిధిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్ ముఖ్య అతిథిగా పాల్గోని ప్రారంభించారు. 20మంది వైద్యులు 10 మంది వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైద్య శిబిరాన్ని రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ ప్రమీలా దేవి సందర్శించి మాట్లాడుతూ… ఆరోగ్యమే మహాభాగ్యమని చౌకగా దొరికే ఆయుర్వేద మందులు వాడటం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉందామని అన్నారు. జిల్లా నోడల్ అధికారి డా. రాజు మాట్లాడుతూ… ఆయుర్వేద ఆద్యుడు ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని జాతీయ, ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా, అందరం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలనేదే ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. అందరూ ఆయుర్వేద వైద్యం పై అవగాహన కలిగి ఆరోగ్యంగా జీవించాలని, ఆయుర్వేద వైద్య ప్రాముఖ్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి దీర్ఘాకాలిక వ్యాధులను దూరం చేసుకోవాలని అన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాశ్ మాట్లాడుతూ.. ఈ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలను పేదలు నివసించే కాలనీలలో ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని.. ఉచిత పరీక్షలు మరియు మందులు అందజేయాలని కోరారు.సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత శిబిరంలో 600 మందికి ఉచిత పరీక్షలు చేసి, మందులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మధు, ఉపాధ్యాయ బృందం, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు కొన్ రెడ్డీ మల్లారెడ్డి, యన్.సదానందం, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు యస్.సత్యన్నారాయణ, జి.సాంబయ్య, విశ్రాంత ఉద్యోగుల కమిటీ అధ్యక్షులు, డిప్యూటీ నోడల్ అధికారి డాక్టర్ శ్రీలత, డాక్టర్ మంజుల, డాక్టర్ రాజేందర్, డాక్టర్ ఉషారాణి, డిపిఎం జి.రాజు, డాక్టర్ వల్లబోజు మోహన్రావు, ఎన్ఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ గుండ రవీందర్, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ సహజ, డాక్టర్ సాదియా, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ అనిత, డాక్టర్ స్రవంతి, యోగా ఇన్స్ట్రక్టర్లు పాల్గొన్నారు.


