Preloader
జై భారత్ వాయిస్ న్యూస్ తిరుమల:: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా తిరుమలలో జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాల కోసారి అధికమాసం వస్తుంది. ఇలావచ్చిన. సందర్భాల్లో  కన్యామాసం  (భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి  బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, పెద్ద రథం, ధ్వజావరోహణం  ఉండవు. ప్రతిరోజూ ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 6.30 నుండి 11.30 గంటల వరకు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో. వాహనసేవల  వైశిష్ట్యం ఇలా ఉంది.
వాహన సేవల వివరాలు :
అక్టోబరు 11 – అంకురార్పణం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు
అక్టోబరు 12 – బంగారు తిరుచ్చి ఉత్సవం – ఉదయం 9 గంటలకు పెద్దశేష వాహనం – రాత్రి 7 గంటలకు వరకు
అక్టోబరు 13 – చిన్నశేష వాహనం – ఉదయం 8 గంటలకు హంస వాహనం – రాత్రి 7 గంటలకు
అక్టోబరు 14 – సింహ వాహనం – ఉదయం 8 గంటలకు ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 గంటలకు
అక్టోబరు 15 – కల్పవృక్ష వాహనం – ఉదయం 8 గంటలకు సర్వభూపాల వాహనం – రాత్రి 7 గంటలకు
అక్టోబరు 16 – మోహినీ అవతారం – ఉదయం 8 గంటలకు గరుడ వాహనం – సాయంత్రం 6.30 గంటలకు
అక్టోబరు 17 – హనుమంత వాహనం – ఉదయం 8 గంటలకు
పుష్పక విమానం – సాయంత్రం 4 గంటలకు గజ వాహనం – రాత్రి 7 గంటలకు
అక్టోబరు 18 – సూర్యప్రభ వాహనం – ఉదయం 8 గంటలకుచంద్రప్రభ వాహనం – రాత్రి 7 గంటలకు
అక్టోబరు 19 – స్వర్ణరథం – ఉదయం 7 గంటలకు అశ్వ వాహనం – రాత్రి 7 గంటలకు
అక్టోబరు 20 – చక్రస్నానం – ఉదయం 6 గంటలకు జరుగుతాయని టీటీడీ అధికారులు తెలిపారు

Share this news as a Photo Card

27 September 2026

అక్టోబరు 12 నుండి 20వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

www.jaibharatvoice.com