Preloader

(జై భార‌త్ వాయిస్ న్యూస్ వ‌రంగ‌ల్)
వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని మంగ‌ళ‌వారం నాడు ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ప్రవచనకర్త డాక్ట‌ర్ చాగంటి కోటేశ్వర రావు సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన కోటేశ్వర రావుకి ఆలయ చైర్మన్ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, మయూరి రామేశ్వర్రావు, కమటం వేణుగోపాల్, మాడిశెట్టి సతీష్, కల్లూరి పవన్ కుమార్, చిదురాల అంజనీదేవి, పేరాల శ్రీనివాస రావు, రమేష్ చంద్ భంగ్, వాసవీ రెడ్డి ప్రధానార్చకులు భద్రకాళి శేషులు పూర్ణకుంభంతో, వేదస్వస్తితో ఘనస్వాగతం పలికారు. ముందుగా గోకులంలో గోప్రదక్షిణ చేసి అనంతరం శ్రీ వల్లభ గణపతిని దర్శించిన తర్వాత అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం ఆలయ మహామంపడపంలో అర్చకులు, వేదపండితులు మహదాశీర్వచనం నిర్వహించిన తదుపరి భక్తులను ఉద్దేశ్యించి తమ ప్రవచనం జరిపారు. ఈ సందర్భముగా చాగంటి కోటేశ్వరరావుని వారి ప్రవచనం వినుటకు అనేక మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు

Share this news as a Photo Card

03 November 2026

భద్రకాళీ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న‌ చాగంటి కోటేశ్వర రావు

www.jaibharatvoice.com