కదిరి: కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి రోజురోజుకూ ప్రజల ఆదరణ పెరుగుతోంది. ఇందులో భాగంగా మున్సిపల్ 26వ వార్డుకు చెందిన యువత వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నిజాం, జిలాన్, జమ్రు, పార్వతమ్మ తదితర యువత టీడీపీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కి పార్టీ కండువాలు వేసి సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన యువతకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.