సోమందేపల్లి : ప్రతి విద్యార్ధికి మంచి చదువు చెప్పి వారి బంగారు భవిష్యత్ కి నాంది పలకాలి అని,ప్రతి ఒక్క స్కూల్ కమిటీ చైర్మన్ లు వారి పాఠశాలల అభివృద్ధి కోసం పాటు పడాలని టిడిపి నాయకులు నీరుగంటి చంద్రశేఖర, శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల వ్యాప్తంగా మంగళవారం SMC ఎన్నికలు జరిగాయి, ఇందులో భాగంగా ప్రతి పాఠశాల లో జరిగిన ఎన్నికలను దగ్గర ఉండి చూసారు చంద్రశేఖర్, ఈ సందర్బంగా పాపిరెడ్డిపల్లి లోని KGBV లో మంగళవారం SMC ఎన్నికలు జరిగాయి, ఈ ఎన్నికల్లో KGBV చైర్మన్ గా మణి భగవంత్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నీరుగంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మంచి పాఠాలు చెప్పి, వారికీ మంచి నాన్యమైన ఆహరం అందించాలి అని, ప్రతి ఒక్కరు తమ పాఠశాలలో ఉన్న ఇబ్బందులను పరిష్కారం చేయాలన్నారు, అదే విధంగా ప్రభుత్వ పాఠశాల వైపు ప్రతి ఒక్కరు చూసి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి బంగారు భవిష్యత్ కి మార్గం వేయాలన్నారు చంద్రశేఖర్, ఈ కార్యక్రమం లో ఎంఇఓ ఆంజనేయులు నాయక్, కన్వీనర్ వెంకటేష్, పట్టణ అధ్యక్షులు వడ్డే సూరి, పట్టణ ఉపాధ్యక్షులు ఆకుల రమణ, మాజీ ఎంపీటీసీ కిష్టప్ప, అన్సర్ భాష, లవ్లీ సతీష్, మద్దిలేటి, జెసిబి శ్రీధర్ కేజీబీవీ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.