Preloader

జై భార‌త్ వాయిస్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా
శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లును పొలీసు అధికారులు చేప‌ట్టారు.జిల్లాలోని హిందూపురం, పెనుకొండ, మడకశిర, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి మున్సిపల్ కార్యాలయాల్లోని నామినేషన్ కేంద్రాల వద్ద విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ కేంద్రాలు, పరిసర ప్రాంతాలపై డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు.నామినేషన్ల ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టారు.ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసు శాఖకు సహకరించాలని పోలీసులు కొరారు.

Share this news as a Photo Card

16 October 2026

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా

www.jaibharatvoice.com