అవయవ దానం మహా దానం అని వరంగల్ నేత్ర , శరీర అవయవ దాతల అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారుఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామానికి చెందిన వల్లెపు కోమల (69) అనారోగ్యంతో సెప్టెంబర్ 29న మృతి చెందగా, కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె నేత్ర, శరీర దానం చేశారు. నేత్రదానం ద్వారా ఇద్దరు అంధులకు చూపు లభించగా, శరీరదానం వైద్య విద్య బోధనకు ఉపయోగపడనుంది. ఆదివారం ఆమె నివాసంలో ఎంసీపీఐ(యూ) హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను శాలువాతో సత్కరించి అభినందన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేత్ర, శరీర, అవయవ దానంపై అవగాహన కల్పించారు. తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ అధ్యక్షుడు కొన్‌రెడ్డి మల్లారెడ్డి మాట్లాడుతూ అవయవ దానం మహాదానమని, ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు హంసరెడ్డి, నీల రవీందర్, చంద్రయ్య, రమేష్, బంధుమిత్రులు, అసోసియేషన్ ప్రతినిధులు కడారి శ్రీనివాస్, కొమ్ముల సురేందర్, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.