Preloader
జాతీయ రహదారిపై డివైడర్ల మధ్యన ఉన్న చెట్ల వల్ల వాహనదారుల ఇబ్బందులు 

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)

జాతీయ రహదారిపై ఆత్మకూరు మండల కేంద్రంలో డివైడర్స్ మధ్యలో ఎత్తు గా పెరిగిన చెట్ల వల్ల రహదారిపై ప్రయాణించే వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆత్మకూరు మండల కేంద్రంలో జాతీయ రహదారి నిర్మాణం మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేశారు అనంతరము డివైడర్ల మధ్యన చెట్లను పెంచారు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ బస్ స్టేషన్ సమీపంలో , అలాగే పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, డివైడర్ల మధ్య నుంచి వెళ్లే విధంగా క్రాస్ ఏర్పాటు చేశారు. డివైడర్ల మధ్యన ఎత్తు గా పెరిగిన చెట్ల వద్ద ఒకవైపు నుంచి మరొకవైపుకు వాహనదారులు వెళ్లడానికి ఎదురుగా వస్తున్న వాహనాలు కనపడకపోవడం వల్ల అనేక అవస్థలు పడుతున్నారు. ఈ ఎత్తు గా పెరిగిన చెట్ల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని మండల ప్రజలు ఆరోపించారు. డివైడర్ల మధ్యన పెరిగిన పెరిగిన చెట్ల వల్ల రాత్రిపూట అనేక ఇబ్బందులు పడుతున్నారని మండల కేంద్రంలో పలువురు వాహనాలు వాపోయారు. ఎదురుగా వస్తున్న లారీల కు ఉన్న అత్యంత కాంతివంతమైన హెడ్ లైట్ల వల్ల రోడ్డు క్రాసింగ్ వరకు అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై ఈ చెట్లను తొలగించి ప్రమాదాల నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు

Share this news as a Photo Card

03 October 2026

జాతీయ రహదారిపై డివైడర్ల మధ్య ఎత్తు గా పెరిగిన చెట్ల తో ఇబ్బందులు

www.jaibharatvoice.com