(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
ఆత్మకూరు మండల కేంద్రం తో పాటు పలు గ్రామాల్లో బొడ్డెమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా బొడ్డెమ్మను పూజించి కోలాటం ఆడారు.
ఈ సందర్భంగా మహిళలు బొడ్డెమ్మకు ప్రత్యేక పూజలు చేసి, పూలతో అలంకరించి ఆటపాటలతో సందడి చేశారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా ప్రతి రోజు సాయంత్రం మహిళలంతా ఒకచోట చేరి బొడ్డెమ్మ చుట్టూ కోలాటం వేస్తూ పండుగను జరుపుకుంటున్నారు.
మండల కేంద్రంలో కార్యక్రమంలో జరిగిన వేడుకల లో గుండెబోయిన శ్రీలత, బాషాబోయిన మల్లికాంబ, భయ్యా రజిత, భాషబోయిన అపర్ణ, భాషబోయిన సాంబలక్ష్మి, బొల్లపల్లి ఉమా, కోడూరి అరుణ, ముత్యాల ఉమా, ముత్యాల రజిత, ముత్యాల ఝాన్సీ, గుండెబోయిన అఖిల, జన్ను ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
