(జై భారత్ వాయిస్ న్యూస్ – ఆత్మకూరు)
మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండా మురళీధర్ రావు జన్మదిన వేడుకలు శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ అభిమానులు అట్టహాసంగా నిర్వహించారు.కొండా వీరాభిమాని, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెలిదే లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో ఆత్మకూరు పాత బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరిపారు. అనంతరం వృద్ధులకు, చిన్న పిల్లలకు స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వెలిదే లక్ష్మణమూర్తి మాట్లాడుతూ..గ్రామాల్లో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కొండా మురళీధర్ రావు, కొండా సురేఖ దంపతులు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటిదని అన్నారు. కొండా మురళీధర్ రావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వరంగల్ వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ జిన్నా వెంకట రమణారెడ్డి (వెంకన్న), కాంగ్రెస్ మండల నాయకులు వెల్ది వెంకటేశ్వర్లు, వడ్డేపల్లి ప్రసాద్, గుండెబోయిన శ్యామ్, కుసుమ సదయ్య, సతీష్, ఎండి సఖావత్ తదితరులు పాల్గొన్నారు.
