Preloader
ఫ్యూచర్ సిటీగా మారనున్న ఆత్మకూరు
– అభివృద్ధి పనులను పరిశీలించిన కుడా చైర్మన్ గుండు సుధారాణి

(జై భారత్ వాయిస్ న్యూస్ – ఆత్మకూరు)

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రం భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చెందనుందని వరంగల్ కుడా చైర్మన్ గుండు సుధారాణి అన్నారు.గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆత్మకూరులో జరుగుతున్న రోడ్ల విస్తరణ, డ్రైనేజీ, పార్కుల అభివృద్ధి, లే అవుట్ ల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వరంగల్ నగరానికి సమీపంలో ఉన్న ఆత్మకూరు మండల కేంద్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇక్కడి అభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కుడా పరిధిలోకి వచ్చిన తర్వాత ఆత్మకూరు రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు.భవిష్యత్తులో ఆత్మకూరు మరింత అభివృద్ధి చెంది, ఆధునిక పట్టణంగా, ఫ్యూచర్ సిటీగా మారుతుందని, రియల్ ఎస్టేట్ తో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే కుడా లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కుడా అధికారులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

23 October 2026

ఫ్యూచర్ సిటీగా మారనున్న ఆత్మకూరు

www.jaibharatvoice.com