Preloader

జై భార‌త్ వాయిస్ న్యూస్ హ‌న్మ‌కొండ‌
వరంగల్‌లోని న్యూ శాయంపేట ప్రాంతంలో ఉన్న శ్రీ దోనగుట్ట సంతోష లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో మాజీ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు, హోమం, స్వామివారి కల్యాణ మహోత్సవంలోపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు.ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ స్వామివారికి విశేష పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ పవిత్ర వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా కొండా సురేఖ గారు ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని స్వామివారిని ప్రార్థించారు. శ్రీ సంతోష లక్ష్మీ నరసింహ స్వామివారి దివ్య కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ఇటువంటి దైవిక వేడుకలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

Share this news as a Photo Card

12 October 2026

శ్రీ దోనగుట్ట సంతోష లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కొండా సురేఖ‌ ప్రత్యేక పూజలు

www.jaibharatvoice.com