(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం పని చేసిన వారికి అండగా ఉంటానని రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు తెలిపారు .ఆత్మకూరు మండలంలోని హౌజ్ బుజుర్గ్ గ్రామానికి చెందిన ప్రత్యేక తెలంగాణ కోసం పని చేసిన ఉద్యమకారుడు నీలం కుమార్ తండ్రి నీలం సారయ్య ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి ఆర్థిక సాయం అందజేశారు. పరకాల నియోజకవర్గం లోని తెలంగాణ ఉద్యమకారులందర్నీ కాపాడుకుంటానని వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నానని ఉద్యమకారులకు ఏమైనా కష్టాలు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.పరకాల నియోజకవర్గ ఉద్యమకారులు అందరికీ ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుసడ్ల సదానందం జిల్లా యూత్ కార్యదర్శి వంగేటి ప్రభాకర్ ,ఆత్మకూరు మండల అధ్యక్షులు ఎండి బాబుమియా (చిరు) అంకతి రవి, భాష బోయిన సాగర్, హుస్సే న్, శంకర్, ముత్యాల మహేందర్ తదితరులు అందరు పాల్గొన్నారు.