-పునః ప్రారంభించిన రీజినల్ మేనేజర్ రిషికేష్ రంజన్ కుమార్
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) : ఆత్మకూరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ బ్రాంచ్ నూతన భవనంలో కి సోమవారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీనియర్ రీజినల్ మేనేజర్ రిషికేష్ రంజన్ కుమార్ లాంచనప్రాయంగా పున: ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖాతాదారులకు గ్రామస్తులకు బ్యాంకు సదుపాయాలు సేవల గురించి ఆయన వివరించారు. ఐఓబి బ్యాంక్ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తుందని అన్నారు. బ్యాంకు సిబ్బంది ఖాతాదారులకు నాణ్యమైన సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. బ్యాంకు సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ యు మేనేజర్ మోకన అనుపమ సిబ్బంది ఖాతాదారులు పాల్గొన్నారు
