జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
గ్రేటర్ వరంగల్ నగరంలోని వరంగల్ నర్సంపేట రోడ్డు దయానంద్ కాలనీలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో నిర్వహించిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీమతి కొండా సురేఖ పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో కొండా సురేఖ జ్యోతి ప్రజ్వలన చేసి శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

