-చెక్కుల పంపిణీలో తెలంగాణలోనే పరకాల నియోజకవర్గం ప్రథమ స్థానం
-ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
* (జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)
* పరకాల పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆత్మకూరు మండల లబ్ది దారులకు మంగళవారం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ… కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో పరకాల నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. నిరుపేద కుటుంబాలకు ఎలాంటి జాప్యం జరగకుండా వెంట వెంటనే చెక్కులను అందిస్తున్నామని తెలిపారు. చెక్కులు తొందరగా మంజూరు కావడానికి కృషి చేయడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, సమన్వయ కమిటీ సభ్యులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
పాల్గొన్నవారిలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు, బోరిగం వైస్ ప్రెసిడెంట్ కమలాపూర్ రమేష్, రేవూరి రణధీర్ రెడ్డి, పొనుగోటి సత్యనారాయణ, కంచ రవి, కకర్ల రాజు, అలువాల రవి , సర్పంచ్ లు పరికి రమేష్, పెంచికల పేట అధ్యక్షుడు ఎగితె లింగయ్య, నిరుకుల్ల ఆర్ష పరమయ్య తదితరులు పాల్గొన్నారు.
