Preloader
 

ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని కలిసిన సొసైటీ చైర్మన్ లు డైరెక్టర్ లు

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు )

ఆత్మకూరు,పెంచికల పేట సొసైటీ లకు నూతనంగా నియామకం అయిన సొసైటీ చైర్మన్ లు డైరెక్టర్లు గురువారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ని కలిశారు. పెంచికల పేట పిఎసిఎస్ చైర్మన్ ఎగితే లింగయ్య ఆధ్వర్యంలో 12 మంది సొసైటీ డైరెక్టర్లు అలాగే ఆత్మకూరు పిఎసిఎస్ చైర్మన్ నాగేల్లి స్వప్న ఆధ్వర్యంలో 12 మంది సొసైటీ డైరెక్టర్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాల తో సత్కరించి, పూల బొకే లు అందజేసి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ సొసైటీకి ఎన్నికైన చైర్మన్లు సమన్వయంతో పనిచేయాలని కోరారు పెంచికల పేట సొసైటీ చైర్మన్ లు ఎగితే లింగయ్య ఆత్మకూరు సొసైటీ చైర్మన్ లు నాగేల్లి స్వప్నను అభినందించారు ఎలాంటి విభేదాలు లేకుండా సొసైటీలలో రైతుల అభివృద్ధి కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవూరి జలంధర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిలు కమలాపురం రమేష్, కంచ రవికుమార్, మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share this news as a Photo Card

15 October 2026

ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని కలిసిన సొసైటీ చైర్మన్ లు డైరెక్టర్ లు

www.jaibharatvoice.com