*- పెంచికలపేట పీఏసీఎస్ చైర్మన్ గా ఎగితె లింగయ్య నియామకం*
*- కృషి చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి కృతజ్ఞతలు*
(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు) ఆత్మకూరు మండలం పెంచికలపేట పీఏసీఎస్ చైర్మన్ పదవి పెంచికలపేట గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎగితె లింగయ్యను వరించింది.
పెంచికలపేట గ్రామానికి చెందిన ఎగితె లింగయ్య మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చురుకుగా పనిచేస్తున్నారు. గతంలో పెంచికలపేట గ్రామం నర్సంపేట నియోజకవర్గంలో ఉండగా, ఆ తర్వాత శాయంపేట నియోజకవర్గంలో, ప్రస్తుతం పరకాల నియోజకవర్గంలో కలిసింది. అప్పటి నుంచి లింగయ్య గ్రామ కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీ అప్పగించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రేవూరి ప్రకాశ్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు. ఆయన చేసిన సేవలను గుర్తించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఎగితె లింగయ్యకు పెంచికలపేట పీఏసీఎస్ చైర్మన్ గా ఉత్తర్వులు ఇప్పించారు.
తనకు పీఏసీఎస్ చైర్మన్ పదవి రావడానికి కృషి చేసిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికి ఎగితె లింగయ్య కృతజ్ఞతలు తెలిపారు.
