Preloader
కాంగ్రెస్‌ కోసం అంకితభావంతో పనిచేస్తున్న ఏరుకొండ రవీందర్‌ గౌడ్‌

-పార్టీ శ్రేణులకు స్ఫూర్తిగా నిలుస్తున్న నాయకుడు రవీందర్

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)

పదవులు ఎప్పుడూ శాశ్వతం కాదు.. ప్రజల అభిమానం, పార్టీ పట్ల నిబద్ధతే నిజమైన గుర్తింపు అనుకుంటూ ఈ సూత్రాన్ని నమ్ముతూ కాంగ్రెస్‌ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ, ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న నాయకుడు సేవాదళ్ లో పనిచేస్తున్న ఏరుకొండ రవీందర్‌ గౌడ్‌. పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండల పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌గా, ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ సేవాదళ్‌ పరకాల నియోజకవర్గ అధ్యక్షుడిగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

అధికారం లేకున్న కాంగ్రెస్‌ వెంటే..

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో లేని సమయంలోనూ పార్టీని వీడకుండా నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేయడం రవీందర్‌ గౌడ్‌ రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేకతగా ఉంది. రాజకీయంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆత్మకూరు పీఏసీఎస్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన అనంతరం పదవికి దూరమైనా, పార్టీకి మాత్రం దూరం కాలేదు. పదవుల కంటే పార్టీ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ముఖ్యమనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు.

ఆపదలో సాయం చేసే గుణం.. ప్రజాసేవలో ముందడుగు

కరోనా కష్టకాలంలో పేదలకు తనవంతు సహాయ సహకారాలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. పాఠశాలకు శానిటేషన్‌ యంత్రాన్ని అందజేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఆత్మకూరు మండలంలో ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా తనవంతు సాయం చేసేందుకు ముందుండే వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అందుబాటులో ఉండటమే నిజమైన నాయకత్వమనే భావనతో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా కృషి

పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి గెలుపు కోసం పార్టీ శ్రేణులతో కలిసి క్షేత్రస్థాయిలో కృషి చేశారు. ప్రజలను కలుస్తూ కాంగ్రెస్‌ పార్టీ విధానాలను వివరించడంలో తనవంతు పాత్ర పోషించారు. పార్టీ విజయం సాధించడాన్ని వ్యక్తిగత విజయంగా భావిస్తూ, అనంతరం కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

అందరినీ కలుపుకొంటూ.. పార్టీ పటిష్ఠతకు కృషి

పార్టీలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కలుపుకొని ముందుకు సాగడం రవీందర్‌ గౌడ్‌ ప్రత్యేకతగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నియోజకవర్గంలో జరిగే పార్టీ సమావేశాలు, కార్యక్రమాలకు హాజరవుతూ నాయకులు, కార్యకర్తలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఆయన పార్టీ పట్ల చూపుతున్న అంకితభావాన్ని గుర్తించిన కాంగ్రెస్‌ పార్టీ సేవాదళ్‌ నియోజకవర్గ అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది.

పార్టీ గుర్తిస్తుందనే ఆశాభావం

పదవులు ఆశించి కాకుండా పార్టీ పట్ల విశ్వాసంతో, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్న నాయకులకు భవిష్యత్తులో తగిన గుర్తింపు లభిస్తుందని కాంగ్రెస్‌ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. పదవి ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరోలా కాకుండా ఎల్లప్పుడూ పార్టీ వెంటే నిలుస్తూ, ప్రజల మధ్య ఉంటూ సేవ చేయడమే తన లక్ష్యంగా ఏరుకొండ రవీందర్‌ గౌడ్‌ ముందుకు సాగుతున్నారు. పార్టీ పట్ల నిబద్ధత, ప్రజల పట్ల బాధ్యత, సేవ పట్ల అంకితభావం ఆయన రాజకీయ ప్రస్థానానికి ప్రత్యేక గుర్తింపునిస్తున్నాయి.

Share this news as a Photo Card

13 October 2026

కాంగ్రెస్ కోసం అంకిత భావం తో పని చేస్తున్న రవీందర్ గౌడ్

www.jaibharatvoice.com